డబ్బుల్లేకే రోడ్లు వేయలేదని ఏపీ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఆస్పరి మండలం ముత్తుకూరులో 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో 40 శాతం రోడ్లు బాగోలేవనే మాట వాస్తవమన్నారు. ఆగస్టులో నిధులు విడుదలవుతాయని సీఎం జగన్ చెప్పారని, ఆ వెంటనే రోడ్డు పనులు చేపడతామన్నారు.