బీహార్ రాజధాని పాట్నాలో ఇద్దరు యువతులు ఓ మహిళా సీఐపై దాడి చేశారు. ఆదివారం రామకృష్ణనగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఆ ఇద్దరు యువతులు రోడ్డుపై నడుస్తుండగా వారి ఫోన్ను బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే, తమను 3 గంటలు వేచి చూసేలా చేశారని ఆగ్రహంతో ఊగిపోయారు. ఏకంగా మహిళా సీఐను కొట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపారు.