బనగానపల్లె మండలంలోని పలుకూరు సచివాలయం-2 పరిధిలో మంగళవారం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని గ్రామంలో ఇంటింటికి పర్యటించి వైసిపి ప్రభుత్వం హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు.