పెళ్లిరోజు గల్లంతయిన మహిళ కోసం ఆర్కే బీచ్ లో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 8 జంక్షన్ కు చెందిన అప్పారాజు భార్య సాయి ప్రియ సముద్రం రాళ్ల వద్ద ఫోటో తీసుకుంటుండగా నీటిలో పడిపోయింది. ఆ తర్వాత అలా అలా తాకిడికి కొట్టుకుపోయింది. కళ్ళ ముందే తన భార్య నీటిలో కొట్టుకుపోయిందని అప్పలరాజు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. కానీ ఆచూకీ లేకపోయింది. ఆ తర్వాత చీకటి పడిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సూచనలు మేరకు నేవీ కూడా హెలికాప్టర్ ని అందించింది. ప్రస్తుతం హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్. ఏడీ జంక్షన్ సంజీవయ్య నగర్ కాలనీకి చెందిన అప్పలరాజు హైదరాబాదులో పనిచేస్తున్నారు. భార్యతో కలిసి పెళ్లిరోజు కావడంతో బీచ్ కి వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. కళ్ళముందే భార్య గల్లంతవ్వడంతో అప్పలరాజు కన్నీరు గా రోదిస్తున్నాడు.