ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 11:11 AM

విజయవాడ డివిజన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, ఇతర భద్రత సంబంధిత ఆధునికీకరణ పనుల కారణంగా, రైలు సర్వీసులు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మరియు రైలు నం. 17268 విశాఖపట్నం- కాకినాడ పోర్ట్ రైళ్లు ఈనెల 25 నుండి అగస్ట్ 2 వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు. పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లు:


ఈనెల 25 నుండి అగస్ట్ 2 వరకు విజయవాడ నుండి బయలుదేరే రైలు నెం. 12718 విజయవాడ- విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తునిలో షార్ట్ టర్మినేట్ చేయబడిందని అన్నారు. అలాగే అదే విధంగా విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి కాకుండా తుని నుండి ఈనెల 25 నుండి అగస్ట్ 2 వరకు ప్రారంభమవుతుందని అందువల్ల ఈ రోజుల్లో విశాఖపట్నం-తుని మధ్య ఈ రైలు సర్వీసు ఉండదు. 2. 25. 07. 2022 నుండి 02. 08. 2022 వరకు గుంటూరు నుండి బయలుదేరే రైలు నెం. 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట్ వద్ద షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. అదే విధంగా రైలు నెం. 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ 26. 07. 2022 నుండి 03. 08. 2022 వరకు విశాఖపట్నం నుండి కాకుండా సామర్లకోట్ నుండి బయలుదేరుతుంది, అందువల్ల ఈ రోజుల్లో విశాఖపట్నం-సామర్లకోట్ మధ్య ఈ రైలు సర్వీసు ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పు గమనించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com