జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల ఆర్టీపీపీలోని 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మూడో యూనిట్ ను సోమవారం బాయిలర్ లో ఏర్పడిన ట్యూబ్ లీక్ తో నిలిపివేశారు. అనంతరం మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సీఈ మోహన్ రావు తెలిపారు. కాగా, ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని. విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లు ప్లాంటుకు బొగ్గు సరఫరా కావడంలేదని అధికారులు తెలిపారు.
సోమవారం సాయంత్రానికి కేవలం 17 వేల మెట్రిక్ టన్నుల ఉగ్గు నిలువ మాత్రమే ఉంది ఆర్టిపీపీ లోని అన్ని యూనిట్ల పూర్తి సామర్థ్యంతో నడవాలంటే రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ఉత్పత్తిని మాత్రం తగ్గించకుండా బొగ్గును పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో ఆర్టీపిపి పరిస్థితి దినదిన గండగా మారింది.