పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బషా పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలోని తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం అథారిటీ చెప్పినప్పటికీ లెక్క చేయకుండా ప్రభుత్వం ఏజెన్సీని మార్చడం వల్ల పెద్ద తప్పు చేసిందన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు ముందుకు తీసుకెళ్లి పక్కా ప్రణాళికతో ప్రాజెక్టు పనులు చేసిందన్నారు. తెదేపా నాయకులు నాగేశ్వర్నా యుడు, గోపి, చెన్నకేశవరెడ్డి, సత్యారెడ్డి పాల్గొన్నారు.