ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలతో గడప గడపలో సంతృప్తిగా ఉందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని 4వ వార్డులో సోమవారం గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మసీదు వీధిలోని మురుగు కాలువలను పరిశీలించారు. సంబంధిత అధికారులను పిలిచి సత్వరం కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. పుర పాలక ఛైర్మన్ ఎస్. ఫయాజ్‌బాషా, కమిషనర్ ఆర్. రాంబాబు, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.