వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించడంలో వైఎస్ఆర్ జిల్లా ఆకాంక్ష జిల్లాల లక్ష్యాలను అధిగమించడం అభినందనీయమని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో జాయింట్ కలెక్టర్ సి. ఎం. సాయికాంత్ వర్మ అధ్యక్షతన 'జల్ శక్తి అభియాన్ - క్యాచ్ ది రైన్ 2022' కార్యక్రమ అమలు, పురోగతిపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
విసి ముగిసిన అనంతరం జెసిసాయికాంత్ వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది మార్చి 29 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు జలశక్తి అభియాన్ - క్యాచ్ ది రైన్: 2022 అమలులో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతి ఆశాజనకంగా కొనసాగుతోందన్నారు.