5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేడు ప్రారంభం కానుంది. మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్ చేస్తోంది. మంగళవారం ఉ. 10 గంటల నుంచి సా. 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. 5జీ సర్వీసుల స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పోటీపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa