ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే రైతులకు 50 శాతం సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైనవి, 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైన పరికరాలు అందించనుంది.