గుజరాత్లోని బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. కల్తీ మద్యం తాగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి వీరంతా గ్రామంలో కల్తీసారా తాగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, 'సిట్' ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.