ఏపీలోకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ మంగళవారం పర్యటించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఆయన బాధితులను పరామర్శించేందుకు ముందుకు సాగారు. తొలుత పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడి గ్రామంలో ఆయన పర్యటన చేపట్టారు. బాధితులను పరామర్శించి, వారి సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగుల్లంక గ్రామానికి వెళ్లేందుకు పంటిపైనా, ట్రాక్టర్పైనా ప్రయాణించారు.