తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వీరపట్టి సమీపంలోని జేవియర్ నగర్లో సోమవారం దారుణం జరిగింది. రేష్మ(20), మాణిక్క రాజు(28)లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రేష్మకు ఆమె తండ్రి ముత్తు (43) పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. దీంతో జూన్ 28న రేష్మ, మాణిక్క రాజు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరు గ్రామానికి వచ్చారు. సోమవారం కుమార్తె రేష్మ, అల్లుడు మాణిక్కరాజులను ముత్తు గొంతు కోసి హత్య చేశాడు.