పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణములోని ఆటోలకు క్రమ సంఖ్య కేటాయించిన నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్ వారు. ఒక్కో ఆటోకు ఒక్కో క్రమ సంఖ్య కేటాయింపు. డ్రైవర్ వివరాలు అనగా పేరు, చిరునామా,డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు,ఆధార్ నెంబర్లను ఆ క్రమ సంఖ్యలో పొందుపరచడం. ఏదైనా ఘటన జరినప్పుడు లేదా ప్రయాణికులు వస్తువులను ఆటోలలో మర్చిపోయినప్పుడు గుర్తించడం ఈ క్రమ సంఖ్య ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు దాదాపు 2200 ఆటోలకు క్రమ సంఖ్య కేటాయించడం జరిగినది, మిగిలిన సుమారు 800 ఆటోలకు కూడా ఈ క్రమ సంఖ్యలను కేటాయించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఐ అశోక్ కుమార్ తెలిపారు.