చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వేంకటరమణస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో మంగళవారం పూర్తి చేశారు. టిటిడి ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా వీరికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa