సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 136 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. ఇప్పటి వరకు 1553 సెల్ ఫోన్లు రికవరీ చేశారు.వీటిలో 1428 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు. సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన " CHAT BOT" సేవలకు కూడా మంచి స్పందన వస్తోందన్నారు. కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/మిస్ అయిన సెల్ ఫోన్లు అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది.