ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియపై బ్యాంకర్ల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 12:34 PM

కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలోని మాల్లాయిపాలెం టిడ్కో ప్లాట్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, శాసన సభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు  ( నాని ) తో కలిసి పరిశీలించారు . ఈ ఆగస్టు 31వ తేదీ కల్లా ఋణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో గుడివాడ శాసన సభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు ( నాని ) తో కలసి టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియపై బ్యాంకు అధికారులతో పట్టణ స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రుణాలు బ్యాంకు వారు ఇవ్వడానికి కావలసిన డాకుమెంట్స్ ప్రజలు తగిన సమయానికి సమకూర్చుకొని తద్వారా రుణాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com