పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమములో పాల్గొని, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగినది. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 61 అర్జీలను స్వయంగా పరిశీలించి, అర్జీదారులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం చేకూరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వస్తే వారి పట్ల మర్యాదతో ప్రవర్తించాలని, వారికి మేమున్నామనే భరోసా కల్పించే విధంగా వారి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చినారు.