దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నా చేపట్టారు. నేడు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆఫీసు ముందు రోగులు బైఠాయించారు. యాంటీరెటరోవైరల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు ఆ రోగులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు సమీప రాష్ట్రాల్లో కీలకమైన మందులు లభించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మందులు లేకుంటే దేశం హెచ్ఐవీ ఫ్రీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.