మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ ప్రజాప్రతినిధి గొడ్డలితో కొట్టి చంపేసిన ఘోర ఘటన చోటు చేసుకుంది. మరిపెడ మండలంలోని తానంచర్ల పరిధిలోని అజ్మీర తండా ఉప సర్పంచ్ రవీందర్ మంగళవారం తెల్లవారుజామున భార్య మమత(28)ని గొడ్డలితో హత్య చేసి పరారైనట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.