ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"దళిత గర్జన" ధర్నా కి అనుమతి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 01:18 PM

దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో "దళిత గర్జన" ధర్నా జరగాల్సి ఉంది. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. దళిత గర్జన ధర్నాకు బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ...తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యనేతలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగగా... పోలీసులు వారిని కిందకు దింపి అరెస్టు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com