రెండు దశాబ్దాల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న క్రికెట్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మన అమ్మాయిలు ఆడబోయే మ్యాచ్‌ల టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, షఫాలీ వర్మ తళుక్కున మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఈ నెల 28 నుంచి ఈ మెగా ఈవెంట్ జరగనుండగా.. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత బృందం సోమవారం అక్కడికి చేరుకుంది. జూలై 29 నుంచి క్రికెట్ మ్యాచ్‌లు జరగనుండగా.. 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లకు ముందు వెటరన్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి భారత అమ్మాయిలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మహిళల టీ20 ఫార్మాట్ చాలా మారిపోయిందని, 130-140 పరుగులు చేస్తే గెలవలేమని హెచ్చరించింది. పురుషుల క్రికెటర్ల తరహాలో రిచ్ ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఆటగాళ్లకు ఉందని, ఒక్కో జట్టు 160-190 పరుగులను సులభంగా స్కోర్ చేయగలదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 160-170 పరుగులు కూడా ఆదా చేయలేం. భారత జట్టు భారీ స్కోర్లు చేయడంపై దృష్టి పెట్టాలని వేదా కృష్ణమూర్తి సూచించాడు. షెఫాలీ, స్మృతి మంధానకు ధాటిగా ఆడగల సత్తా ఉందని చెప్పింది.