రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్ష పార్టీలు లేఖ రాశాయి. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, రాజకీయ ప్రత్యర్దుల పై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్రం రాజ్యాంగబద్ద సంస్థలను స్వంత లాభం కోసం వాడుకుంటుందని విపక్షాలు దుయ్యబట్టాయి. సమస్యలపై చర్చించకుండా కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతుందన్నారు. నిత్యావసర ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.