నీరజ్ చోప్రా గాయం కారణంగా 2022 కామన్వెల్త్ క్రీడల నుండి వైదొలిగాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే ఆ పోటీలలో అతని కుడి తొడ కండరాలలో గాయమైంది. దీంతో సోమవారం నీరజ్ చోప్రాకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. ఫలితంగా ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని ఐఓసీ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మంగళవారం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa