బీజేపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విమర్శలు చేసారు. దేశంలో ఎన్నికలు బ్యాలెట్ విధానం వాడాలని, ఈవీఏంలు ఉంటే మళ్లీ బీజేపీదే అధికారం అని ఎద్దేవా చేసారు. అంతేగాక దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ఆయన ఆవేదన చెందారు. బీజేపీ పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.