సంక్షేమ పథకాల అమలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని, సంబంధిత లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, మేలుకోరే ప్రభుత్వానికి మద్దతు పలకాలని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. గార మండలంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలున్నంత వరకూ వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ పరిధిలో ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశామని,వీటితో తక్షణం అవసరం ఉన్న పనులను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా వలంటీర్లు మరింత నిబద్ధతతో పనిచేయాలని, గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సమష్టి కృషితో పని చేయాలని సూచించారు.