మా ప్రభుత్వ హయాంలో అప్పులు చేశాము. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంతో పోల్చితే మేము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేసారు. అయన మాట్లాడుతూ... కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు, తమిళనాడులో రూ.1 లక్ష కోట్ల అప్పు పెరిగింది. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఏపీ అప్పుల తీరు చాలా తక్కువ. స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? నిజానికి మా హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువే. ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగింది. ద్రవ్యలోటు 2014లో 3.95% ఉంటే, 2021-22లో 3% కి తగ్గించాము. పొరుగు రాష్ట్రాలు 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు కలిగి ఉన్నాయి. ఒక్క ఏపీ మాత్రమే అప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. యావద్దేశ అప్పు శాతం పెరిగింది. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.