ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక మావోయిస్ట్ హతమయ్యాడు. మృతుడు కాటే కల్యాణే ఏరియా కమిటీ అగ్ర నేత బుద్రం మర్కంగా గుర్తించారు. ఎన్ కౌంటర్ లో మరికొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని తెలుస్తోంది. మిగితా మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి. కాల్పుల్లో హతమైన మర్కంపై గతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రికార్డ్ ప్రకటించింది.