ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత అథ్లెటిక్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా గాయపడ్డాడు. గత ఆదివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నీరజ్ చోప్రా 88.13 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారతీయ అథ్లెట్ మరియు మొదటి అథ్లెటిక్స్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఈ విజయంతో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పతకం ఖాయమని అందరూ భావించారు. అయితే ఇలాంటి ఫిట్‌నెస్ సమస్యలతో నీరజ్ చోప్రా దూరం అవుతాడని ఎవరూ ఊహించలేదు. నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ధృవీకరించింది. సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.