చిత్తూరు: నగరపాలక పరిధిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ డా. జె అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం చర్చి వీధి, సుందరయ్య వీధి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల వ్యాప్తికి కారణమైన దోమల నియంత్రణకు ఉదయం పూట ఫాగింగ్ చేపట్టాలన్నారు.