చిత్తూరు, పలమనేరు: పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను విక్రయించే దుకాణాలపై చర్యలు తప్పవని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంషన్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బజారువీధిలో రహస్యంగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న లక్ష్మీపతి అనే దుకాణం యజమానికి రూ. 10 వేలు జరిమానా విధించారు. ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు వినియోగంపై నిషేధం విధించిందన్నారు.