ఓడిసి మండల పరిధిలోని చింతమాను పల్లి పంచాయతీ గుర్రప్ప గారి పల్లి లో మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదంలో షాక్ కు గురై వెంకటరమణ కు చెందిన ఎద్దు మృతి చెందినట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ భూమికి తక్కువ ఎత్తులో ఉండటంతో మేతకు వెళ్ళిన ఎద్దు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు బాధితుడు వాపోయాడు.
కుటుంబానికి జీవనాధారంగా ఉన్న 70 వేలు విలువచేసే ఎద్దు మృతిచెందడంతో వెంకట రమణ కుటుంబం ఆవేదనకు గురయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు తెలిపారు.