తాడిపత్రి: ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా గుప్త నిధుల కేసులో నిందితుడు మంగళవారం మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మలిరెడ్డి (52) తాడిపత్రిలోని ఆస్పత్రిపాలెంలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గుప్త నిధుల తవ్వ కాల పేరిట కొంతమంది నుంచి డబ్బు వసూలు చేశాడని నమోదైన కేసులో మలిరెడ్డిని రైల్వే కొండాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
సొమ్ము రికవరీ కోసం సోమవారం తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం జీరో రోడ్డు వద్దకు తీసుకొచ్చినపుడు మలి రెడ్డి విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తాడిపత్రి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ హించినట్లు వెల్లడించారు.