వర్షాలు పడుతుండడంతో ఎక్కడికక్కడ మురికి కాలువలు నిండిపోయి వీధుల్లోకి వస్తుందని పలువురు మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని 6వ వార్డు నుంచి గడపగ డపకు మనప్రభుత్వం కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వలంటీర్లు, అధికారులు కలిసి ఇంటింటికివెళ్లి సమస్యలను అడిగితెలుసుకున్నారు. పలువురు మహిళలు వర్షాలుపడుతున్న నేపథ్యంలో మురికికాలువల్లో మట్టి పేరుకు పోయిందని తెలియజేశారు.