శ్రీకాళహస్తి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్యత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తామని చెప్పారు. ఒకే దేశం, ఒకే గ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరులు గ్రామీణ విద్యుదీకరణ వ్యవస్థ తదితర అంశాలపై లఘు చిత్రాలు ప్రదర్శన జరుగుతుందన్నారు.