నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం మరోసారి ఈడీ ప్రశ్నించనుంది. మంగళవారం దాదాపు 6 గంటల పాటు ఆమె ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఇవాళ మరోసారి విచారణకు రావల్సిందిగా కోరారు. ఈ కేసులో సోనియాను జూలై 21న తొలిసారిగా 2 గంటలకు పైగా విచారించారు. ఇప్పటి వరకు సోనియా గాంధీని ఈడీ 55 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.