ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.43 గంటలకు ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని అబ్రా ప్రావిన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి రాజధానిలోని ఎత్తైన భవనాలు కుదుపులకు లోనైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు నమోదు కానప్పటికీ.. ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది.