విజయవాడ బస్టాండ్ ప్రాంతం రాజీవ్ గాంధీ పార్క్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు టిప్పర్ లారీ వేగంగా రోడ్డుపై ఉన్న రైల్వే పోల్ ని ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా క్లీనర్ లారీలో ఇరుక్కు పోయిన పరిస్థితి. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ హుస్సేన్ లు రెండు జెసిబి లు ఒక క్రేన్ సహాయంతో రెండు గంటల నుండి పోరాడుతున్నా, క్యాబిన్ లో ఇరుక్కుపోయిన క్లీనర్ బయటికి రాని పరిస్థితి కనపడుతుంది. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.