అనంతపురం జిల్లా, పుట్టపర్తి: ఓడిసి మండల పరిధిలోని చింతమాను పల్లిలో రమేష్ నాయుడు తన భార్యతో కలిసి బెంగుళూరులోని తన కుమార్తె వద్దకు వెళ్ళి తిరిగి మంగళవారం స్వగ్రామానికి వచ్చి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండు జతల కమ్మలు, రెండు ఉంగరాలు చోరీ చేసినట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ గోపి తన సిబ్బందితో వెళ్లి ఇంటిని పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.