రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే ఆహారంలో తక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. తగిన పీచు పదార్థాలు తీసుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆకు కూరలను తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఆలివ్ నూనె, చేపలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారం తీసుకుంటే ఫలితం ఉంటుంది. అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది.