రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా పక్క రాష్ట్రాల నుండి తరలిస్తున్న మద్యాన్ని పోలీస్ వారు తనికీలు చేసి పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే అధికారుల ఆదేశాలతో పట్టుకున్న మద్యాన్ని ధ్వంసం చెయ్యాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చాల చోట్ల ధ్వంసం చేసారు. ఈ క్రమంలోనే ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల లో ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన సుమారు రెండు కోట్లు విలువ గల 62461 అక్రమ మద్యం బాటిళ్ళను నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని మ్యాంగో మార్కెట్ నందు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు SEB అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేసినారు.