కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్(32) దారుణ హత్యకు గురయ్యాడు. నెట్టారు ప్రాంతంలో మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రవీణ్ చనిపోయాడు. హత్యకు గల కారణాలు, నిందితులెవరో తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకొని శిక్షిస్తామని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు.