విశాఖ లో టీడీపీ పార్టీ ఆఫీస్ లో జోన్ 1 సమావేశం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జోన్ 1 కి సంబంధించి 35 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, నియోజకవర్గ అబ్జర్వర్లు హాజరైనారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీడీపీ నాయకులూ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ... ఆగస్ట్ 30 లోపు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేస్తాము. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం. రాష్ట్రంలో సీఎం కి , వైసీపీ నాయకులకు ధన దాహం ఉంది. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్న వాళ్ళ పై అక్రమ కేస్ లు పెడుతున్నారు. మద్యం నిషేధం పేరుతో డబ్బు అంతా తాడేపల్లికి వెళ్తుంది. ప్రజావ్యతిరేక విధానాల పైన మాట్లాడిన నాయకుడిని ప్రభుత్వం ఇబ్బంది పెడితే, నాయకులు అందరం ఆ నాయకుడి తరుపున పోరాటం చేస్తాం. జగన్ పతనానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలికాము. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉత్తరాంధ్ర లో ఉన్న 34 నియోజకవర్గాలకు టీడీపీ కైవసం చేసుకుంటుంది అని తెలియజేసారు.