రాజమండ్రి కార్పొరేషన్17వ డివిజన్ లో 1000 మంది వరద బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యవసర వస్తువులు కాయగూరలు పంపిణీ చేసిన డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం,అభివృద్ధిలో విజన్ ఉన్న నాయకుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అని కొనియాడారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ ఆల్కట్ తోటలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ 17వ వార్డు ఇంచార్జ్ రొంపిచర్ల ఆంటోనీ ఆధ్వర్యంలో బియ్యం,కాయగూరలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చేతి వృత్తి కార్మికులు,నేత కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అమెరికా పర్యటలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుసుకొని ఆయన కుమారుడు రవి రామ్ కిరణ్ గోరంట్ల ద్వారా 16,17,18,19 వార్డులలో నిరు పేదలకు ఐదు రోజులకు సరిపడే బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు పంపిణీ చేశారు.