దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టపోయి 55,198 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 16,457 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.79.85 గా ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుతం పాజిటివ్ గా ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కొనసాగుతున్నాయి.