దేశంలో చాలా చోట్ల సొంత పిల్లలనే చిత్రహింసలు పెడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఒక జంట తమ 9 ఏళ్ల దత్తపుత్రికను చిత్ర హింసలకు గురిచేసింది. మంచాన్ని నీటితో తడిపినందుకు ఆగ్రహించిన సవతి తల్లి బాలిక ప్రైవేటు భాగాలపై వాతలు పెట్టింది. బాలిక తల్లిదండ్రులు కోవిడ్ కారణంగా మరణించడంతో దగ్గరి బంధువులైన ఈ దంపతులు దత్తత తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.