భారత్ మరో మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం హక్కులు భారత్ దక్కించుకుంది. ఈ మేరకు బర్మింగ్‌హామ్‌లో మంగళవారం ముగిసిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో బీసీసీఐ ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల బిడ్ గెలిచింది. కాగా, దాదాపు దశాబ్దం విరామం తర్వాత భారత్‌లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. భారత్ చివరగా 2013లో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది.