ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి ఆర్ . కే . రోజా అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 03:32 PM

 కృష్ణ జిల్లా పరిషత్ సమావేశపు హాల్ లో జిల్లా సమీక్షా మండలి సమావేశం రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ఆర్ . కే . రోజా , రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అధ్యక్షతన జరిగింది.  తొలుత జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వేదిక మీద జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ని గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు . వివిధ శాఖల వారి పలు అంశాలపై చర్చ ప్రారంభించారు . శాసన సభ్యులు పేర్ని వెంకటరామయ్య ( నాని ) , కొలుసు పార్ధసారధి , సింహాద్రి రమేష్ బాబు , కైలే అనిల్ కుమార్ , వివిధ శాఖల అధికారులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa