అంగోలా దేశంలో అతి పెద్ద పింక్ డైమండ్ ఇటీవల లభ్యమైంది. గత 300 ఏళ్లలో లభ్యమైన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదే. 170 క్యారెట్ల గులాబీ రంగు డైమండ్‌ను 'ది లులో రోజ్' అని పిలుస్తారు. ఇది ఆ దేశంలోని వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతంలోని లులో గనిలో కనుగొనబడింది. గతంలో 59.6 క్యారెట్ పింక్ స్టార్ 2017లో హాంకాంగ్ వేలంలో 71.2 మిలియన్ యుఎస్ డాలర్లకు విక్రయించబడింది. దీనికి అంతకంటే ఎక్కువ ధర పలకనుంది